మా బిల్డింగ్ కు ఒక ఒరిస్సా మనిషి కొత్త సెక్యూరిటిగా రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. అతను నెమ్మదస్తుడు. కనిపించిన ప్రతిసారీ చెయ్యి ఊపి తన అభినందనలు తెలిపేవాడు ఉత్సాహంగా. ఆ విధంగా పరిచయం పెంచుకున్నాడు. ఒకసారి మాటల్లో తాను ఇంగ్లీష్ భాష రాయడం చదవడం కనుక చేయగలిగితే నేను సెక్యూరిటీ ఆఫీసర్ అవుతాను అని చెప్పాడు. వెంటనే నేను ఆ రోజు జనాలకు రాసిన ఇంగ్లీష్ మెసేజ్ ఒకటి చూపించి చదవమని నా ఫోను ఇచ్చాను. అతను తప్పులు తప్పులు గా చదివాడు. దాని తరువాత అతని పరిస్థితి అర్థం అయ్యింది.
నేను అతనికి హిందీ వర్ణమాల వచ్చా అని అడిగాను. అతను నాకు ఒరిస్సా భాష మాత్రమే వస్తుంది అని చెప్పాడు. అతనికి హిందీ భాషలో మాట్లాడటం తెలుసు. అందులోనే మేము మాట్లాడుకుంటాం.ఇక నేను అతనిని అడిగాను. మరి నీకు ఆంగ్లం ఆల్ఫాబెట్స్ వచ్చు కదా అని నిర్థారించు కున్నాను.
నేను ఈ విధంగా అన్నాను నీకు ఆంగ్లం ఆల్ఫాబెట్స్ వచ్చు అంటే మొదటి సమస్య తీరిపోయింది.
రెండవది ఏమిటంటే, ఆంగ్ల పదాలు గుణించుకుని చదవడం. ఇది నా అంచనా ప్రకారం మీకు సరిగ్గా రాదు. అది ముందుగా నేర్చుకోవాలి.
దాని తరువాత చదివిన ఆంగ్ల పదాలకి అర్ధాలు తెలియడం.
ఈ రెండు ప్రక్రియలు నిరంతరం సాధనం చేయడం లక్షం చేరేవరకు.
ఈ విషయాలు అతనికి అర్థం అయ్యే విధంగా చెప్పాను.
ఇప్పుడు రెండవ ప్రక్రియ ఎలా చెప్పాలి అని ఆలోచించి ఈ విధంగా చెప్పాను. మా వాడికి కూడా ఇదే పద్ధతిని అనుసరించాను.
నిలబడి ఉన్న చోట చుట్టూ పరికిస్తే నాకు రెండు ఆంగ్ల పదాలు కనిపించాయి సెక్యూరిటీ క్యాబిన్ మీద. వాటిని ఉదాహరణగా తీసుకుని విషయం బోధించాలి అని అనుకున్నాను.
నాకు కనిపించిన రెండు ఆంగ్ల పదాలు: security, sanitizer.
మన చదువు అంతా మనలోంచి వచ్చిందని గట్టిగా నమ్ముతాను. కాబట్టి నేను ఏది చెప్పిన మొదటి పాయింట్ మనకు సంబంధించిందే అయి ఉండితీరుతుంది. దీనికి కూడా మినహాయింపు లేదు.
మనలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరం రెండవది ప్రాణం. శరీరం ప్రాణం ఉంటేనే మనిషి కదా. అది ఒక మనిషి అవుతాడు. వాడికి ఒక పేరు ఉంటుంది.
అలాగే మనం ఆంగ్ల పదం ను విభజించి ఆ విభజించిన భాగాలను ఒక్కొకటిగా చదివి, ఆ తరువాత వాటన్నింటినీ కలిపి త్వరత్వరగా చదివితే ఆ ఆంగ్ల పదం యొక్క సరైన ఉచ్చారణ వస్తుంది.
మరి ప్రాణం మరియు ప్రాణుల ఆంగ్లంలో ఏమిటి?
ప్రాణంలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి అయిదు మాత్రమే. మన ఐదు వేళ్ళ మీద ఆ ఐదు అక్షరాలు రాసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. అతను ఆ ఐదు అక్షరాలు a e i o u గా రాసుకున్నాడు.
ఇక ఆ తరువాత security పదం మీద నేర్చుకున్న సిద్దాంతం ప్రయోగం చేయదలిచాం.
Security అనే పదం సెక్యూరిటీ కాబిన్ మీద మంచి పెద్ద అక్షరాలతో ఒక మెటల్ ప్లేట్ మీద ఎంబోస్ చేసి రాసి ఉంది.
ఇప్పుడు ఆంగ్ల పదం లో ప్రతి అక్షరంను ప్రాణం మరియు ప్రాణులు గా విభజించుకోవడమే.
ఎక్కడైతే ప్రాణి ప్రాణం కలుస్తుందో అక్కడ నిలువు గీత గీయమన్నాను.
ఇప్పుడు అది మనిషి. దాని పేరు గుణించోకమన్నాను. ఈ విధంగా security అనే మాటకు ఆ ఉచ్చారణ వచ్చింది అని చెప్పాను. అతను చాలా ఆనంద పడ్డాడు.
Se|cu|ri|ty
Sa|ni|ti|ze|r
చివరిగా మిగిలిన "r" సగం మాత్రమే చదువుతాం. ఎందుకంటే అది పూర్తి ప్రాణి కాదు కాబట్టి.
Sanitizer --> సానిటైజర్
ఈ విషయాలం తెలుగు లో స్పష్టంగా తెలుస్తుంది.
ఇక మూడవ స్టెప్ కి, నేను డిక్షనరీ మోబ్లైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను.
ఒక పది రూపాయల పెడితే పాత న్యూస్ పేపర్లు బోల్డ్ దొరుకుతాయి. వీటితో ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవచ్చును అని చెప్పాను.
వాడి మొహం వెలిగించిన మాతాబోలే మిలమిలా మెరుస్తూ కనిపించింది. నాకు మాత్రం అదే నిజమైన దీపావళిగా అనిపించింది.
Comments
Post a Comment