క్రికెట్ ఆట ఇండియాలో అందరూ ఆనందించే ఆట. దానిని అందరూ చూసి ఆనందిస్తూ ఉంటారు. కానీ చాలా మందికి కాస్త క్రికెట్ టెక్నికల్ మాటలు వాడి మాట్లాడితే వారికి ఆట పూర్తిగా అర్థం కాదు. దీనికి ముఖ్య కారణం చాలా మందికి క్రికెట్ ఫీల్డ్ పొజిషన్స్ తెలియక పోవడమే.
క్రికెట్ ఆట ఆడే వాళ్ళకు ఈ క్రికెట్ ఫీల్డ్ పొసిషన్స్ బాగా తెలుస్తాయి ఎందుకంటే వారు తమ ఫీల్డర్స్ ని ఆటకు తగ్గట్టుగా పెట్టుకుని ఎదుటి టీం బ్యాట్స్మన్ ని తర్వగా అవుట్ చేసి గెలవడానికి పథకాలు రచిస్తారు.
ఆ జ్ఞానం కొంత క్రికెట్ క్రీడాభిమానులకు తెలిస్తే ఆట ఇంకా చూసి కామెంటరీ విని ఆనందిస్తారు అని నా నమ్మకం. అప్పుడు గవాస్కర్ గారు చెప్పే క్రికెట్ జ్ఞానం కామెంటరీ ద్వారా ఇంకా బాగా అర్థం అవుతుంది.
క్రికెట్ ఫీల్డింగ్ స్థానాలకు పేర్లు చాలా శాస్త్రీయంగా పెట్టారు. ఆ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. మనం ఈ బ్లాగులో ఈ విషయాలను తర్కంతో తెలుసుకుందాం. ఈ తర్కం మన లెక్కల జామెట్రీతో ముడి పడి ఉంది అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది అనుకోవచ్చు క్రికెట్ ఆడటానికి వచ్చిన ఈ చదువు మరీ ముఖ్యంగా లెక్కలు వదలవా?
క్రికెట్ ఫీల్డింగ్ స్థానాలను రెండు రకాలుగా విభజించవచ్చును.
1. Symmetrical field positions:
ఈ ఫీల్డ్ పొసిషన్స్ మనం ఒక అడ్డ గీత క్రికెట్ మిడిల్ వికెట్ ద్వారా ఒక లైన్ గీస్తే అది క్రికెట్ ఫీల్డ్ ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆ లైన్ కి అటు ఇటు సమాంతరంగా ఈ ఫీల్డ్ పొజిషన్స్ ఉంటాయి.
ఉదాహరణ: mid on మరియు mid off. మనము మరియు ఇటువంటి చాలా ఫీల్డ్ పొజిషన్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి మనం సమగ్రంగా తెలుసుకుందాం.
2. Fixed field positions:
ఈ ఫీల్డ్ పొసిషన్స్ కి ఎటువంటి symmetrical ఫీల్డ్ పొసిషన్స్ ఉండవు. ఇవి ఒకటే ఫీల్డ్ పొసిషన్ గా ఉంటాయి.
ఉదాహరణ: బ్యాట్స్మన్ వికెట్లు వెనకాల ఉండే wicket keeper position. ఇది ఒకటే ఉంటుంది. అలాగే slips కూడా.
తరువాత క్రికెట్ మైదానంలో మనం ఈ క్రింది ఊహాజనితమైన వలయాలను batsman నుంచి దూరాన్ని బట్టి ఊహించుకోవాలి. చూడండి మన geometry distance ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం.
1. Close -in
2. In field మరియు
3. Out filed
ఈ వలయాలను మనం ఈ క్రింది విధంగా define చేస్తాం.
Short వలయం అంటే ఇది batsman కి దగ్గరగా ఉండే వలయం అని అర్థం. దీని close in positions అంటాం. ఇందులో వచ్చే కొన్ని ఫీల్డ్ పొసిషన్స్ ఏమిటంటే silly point మరియు short leg.
In field positions మనకి 30 yards వలయం లోపల ఉండే field positions అన్న మాట. ఉదాహరణకు cover మరియు mid on field positions.
తరువాతది outfield వలయం. ఇది దాదాపు క్రికెట్ బౌండరీకి దగ్గరగా ఉంటుంది అని ఊహించుకోవాలి. ఉదాహరణకు long on , deep square leg filed positions.
On side మరియు off side అంటే ఏమిటి?
మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా బ్యాట్స్ మెన్ బాడీవైపు ఉన్న అర్థ మైదానం ను onside అని లేదా ఒక్కోసారి leg side అని కూడా అంటారు.
Off side అంటే బ్యాట్స్మన్ బ్యాట్ వైపు ఉండే అర్థ మైదానంని అంటారు.
ఈ క్రింది ఫిగర్ లో on side and leg side అనే విభాగాలు ఒక right handed batsman కి చూడవచ్చును.
అదే left handed batsman కి చూపించిన వాటిని విరుద్ధంగా ఊహించుకోవాలి. అంటే off side on side అవుతుంది మరియు on side offside గా మారుతుంది. బహుశా దీనికే నేమో ఈ symmetrical field positions అనేవి వాడుకలో వచ్చాయి.
Batsman నుంచి direction బట్టి కూడా ఫీల్డ్ పొసిషన్స్ని నిర్వచించారు.
Straight direction: ఇది batsman కి ఎదురుగా ఉండే Direction field positions. ఉదాహరణకు mid on and mid off in field positions.
Square direction: ఇది batsman కి 90 degrees లో ఉండేవి. Off side ఉంటే point field position అని on side 90 degrees గా ఉంటే square leg field position అంటారు.
Fine direction: batsman wickets వెనుకాల ఉండే boundary కి దగ్గరగా ఉండే on side ఉండే field position నుంచి fine leg అంటారు.
Cover direction: point field position కి మరియు mid off మధ్య ఉండే దానిని cover area అంటారు.
Mid wicket direction : square leg field position మరియు mid on field positions ని mid wicket area అంటారు.
ఇక మనం ఫీల్డ్ పొసిషన్స్ గురించి తెలుసుకుందాం.
1. Symmetrical field positions
Mid-off & Mid-on: ఇవి రెండూ ఫీల్డ్ పొసిషన్స్ 30 yards circle లో bowler కి దగ్గరగా ఉంటాయి.
ఈ ఫీల్డ్ positions ని మనం batsman కి దగ్గరగా జరుపుకోవచ్చును లేదా boundary కి దగ్గరగా జరుపుకోవచ్చును.
Batsman కి దగ్గరగా జరిపితే ఈ ఫీల్డ్ పొజిషన్స్ ని silly mid-off and mid-on అని అంటారు.
అదే boundary కి దగ్గరగా ఉంటే long off and long on field positions అని అంటారు.
ఈ field positions ని ఈ క్రింది ఫిగర్ లో చూడవచ్చును.
ఇవి batsman కి ఇరువైపుల 90 degrees లో ఉండేsymmetrical field positions. Batsman నుంచి దూరాన్ని బట్టి మనకి short or silly, in field లేక deep లేదా long field positions ఈ ఫీల్డ్ పొజిషన్స్ కి adjectives మాదిరిగా చేరుతాయి.
Point position అనేది batsman కి offside 90 degrees లో ఉంటుంది. అదే onside 90 degrees లో ఉండేది square leg field position అవుతుంది.
ఈ క్రింది ఫిగర్ ఈ ఫీల్డ్ పొజిషన్స్ చూపిస్తుంది.
Cover and Mid wicket positions:
Cover area అనేది offside point మరియు mid off field positions మధ్య వస్తుంది.
Mid wicket area వచ్చి on side square leg మరియు mid on మధ్య వస్తుంది.
Batsman నుంచి దూరం బట్టి మనకు
Short cover, cover మరియు deep cover field positions వస్తాయి.
Symmetrically, onside లో short mid wicket, mid wicket మరియు deep mid wicket fielding positions వస్తాయి.
ఈ ఫీల్డ్ పొజిషన్స్ ని ఈ క్రింది ఫిగర్ లో చూడండి.
Third man and Fine leg field positions:
ఇవి wickets వెనకాల off side మరియు on side ఉండే symmetrical field positions.
Batsman నుంచి దూరాన్ని బట్టి మనకు ఈ ఫీల్డ్ పొజిషన్స్ deep thirdman మరియు deep fine leg గా ఉంటాయి.
Gully మరియు leg gully field positions:
ఇవి symmetrical field positions ఒకటి off side మరియు ఒకటి on side field positions wickets వెనుక ఏరియా లో ఉంటాయి.
ఈ పైన పేర్కొన్న ఫీల్డ్ పొజిషన్స్ ని ఈ క్రింది ఫిగర్ లో చూడవచ్చును.
2 Fixed Field Positions
ఈ ఫీల్డ్ పొజిషన్స్ కి symmetrical జతులు లేవు. ఈ ఫీల్డ్ పొజిషన్స్ నిర్థిష్టమైన బాట్తో ఆడే కోణం కి సంబంధించినవి.
Slips (1st, 2nd, 3rd) – Always on the off-side behind the batsman.
ఈ మూడు ఫీల్డ్ పొజిషన్స్ off side లో batsman వెనుక వైపున ఉంటాయి.
Leg Slip – ఈ ఫీల్డ్ పొజిషన్ on side batsman వెనుక వైపున ఉంటుంది.
Wicketkeeper – wickets వెనుకాల నిలబడి ఉంటాడు.
Bowler – అనే వాడు wickets ముందు ఉండి bowling చేస్తాడు. ఇతను కూడా బౌలింగ్ చేసిన తర్వాత ఒకే ఫిల్డర్ తో సమానం.
ఈ క్రింది ఫిగర్ లో ఈ పైన పేర్కొన్న fixed field positions చూడవచ్చును.
ఈ క్రికెట్ ఫీల్డ్ జ్ఞానంతో టీముల గేమ్ strategy మనం కాస్త deep గా అర్థం చేసుకోవచ్చు. మనం ఈ బ్లాగులో ఫీల్డ్ పొసిషన్స్ right handed batsman కోసం రాశాం. కానీ left handed batsman కోసం మనం onside and off side positions reverse చేసుకుని సులువుగా అర్థం చేసుకోవచ్చును.
Comments
Post a Comment