మొబైల్ ఫోనులో తెలుగు టైపింగ్ మన తెలుగు వ్యాకరణానికి అనుగుణంగానే ఉంది.
కొన్ని ముఖ్యమైన మెలుకువలు:
1. మన గుణింతాలు ఎలా టైప్ చేయాలి
మన వ్యాకరణ సూత్రాలు
క్ + అ = క ( దీనిని సులువుగా టైప్ చేయవచ్చు)
క్ + ఆ = కా
క్ + ఇ = కి
క్ + ఈ = కీ
క్ + ఉ = కు
క్ + ఊ = కూ
క్ + ఋ = కృ
క్ + ౠ = కౄ
క్ + ఎ = కె
క్ + ఏ = కే
క్ + ఐ = కై
క్ + ఒ = కొ
క్ + ఓ = కో
క్ + ఔ = కౌ
క్ + అం = కం
క్ + అః = కః
ఇదే సూత్రాన్ని అన్ని హల్లుల గుణింతాలు కు వాడాలి.
మెలుకువ 2:
వత్తులు ఎలా టైప్ చేయాలి
ఉదాహరణ:
అక్కయ్య
అ
క్ : క + ్ (టైప్ చేయాలి)
క్క : క్ + క
య్య: య్ + య
సంక్లిష్ట అక్షరం ఎలా టైప్ చేయాలి:
రా *ష్ట్ర* ము.
ష్ట్ర : ష + ్ + ట వత్తు + ్ + ర వత్తు
ఈ మెలుకువలు తో ఎవరైనా తెలుగు టైపింగ్ సులువుగా చేయవచ్చును.
అంతే కాదు, మన ఇండియా భాష లన్నింటికీ ఇదే పద్ధతి.
ఇక మనం టైప్ చేస్తుంటే machine learning తో మనకు కావలసిన పదాలు టైపింగ్ సాఫ్ట్వేర్ చూపిస్తుంది.
ఇక ఏదైనా తప్పు టైప్ చేసిన ఒక అండర్ లైన్ తో చూపిస్తుంది.
Comments
Post a Comment