ఈ క్రింది అసమానతల గుర్తులు మనం లెక్కల్లో చూసే ఉంటాం.
*అసమానతల గుర్తులు:*
=, >, <, <>, >=, <=
మరి అవి లెక్కల్లో ఎలా ప్రవేశించాయి అంటే అవి మన వాస్తవ మానవ జీవితం అసమానతల సమ్మేళనం నుంచే వచ్చాయి అనే చెప్పాలి. ఈ అసమానతల గురించి నిర్ధిష్టమైన పద్దతి లో మాట్లాడుకోవాలి అంటే మనకు మన భాష దానికి సంబంధించిన భాషాభాగాలు పుష్కలంగా సహకరించాలి.
కొన్ని అసమానతల స్ధిరంగా ఉంటాయి మరి కొన్ని అస్ధిరం.
స్ధిరంగా ఉన్నవి ఎలాంటి అంటే ఒక మనిషి కాని ఒక వస్తువు కాని ఒక స్థలం గురించి కాని కనులకు కనిపించేవి మరియు కనిపించనవి. వాటన్నింటినీ కలిపి మనం దాని స్ధితి అంటాం. స్ధితి లో ఎత్తు, లావు, పొడుగు, రంగు మున్నగునవి కనపించేవాటి కింద తెలివి, ధైర్యం మున్నగునవి కనిపించని వాటిగా ఉదాహరణ క్రింద చెప్పుకోవచ్చును.
మనం రెండు లేక ఎక్కువ సబ్జెక్ట్స్ యొక్క స్ధిరఅస్థిర అసమానతల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా మనం ఏ భాషలో ఈ భావాన్ని వ్యక్త పరుస్తున్నామో ఆ భాష యొక్క వాక్యం యొక్క నమూనాను అర్థం చేసుకోవాలి.
ఉదాహరణగా మనం ఒక విద్యార్థి తెలివితేటల గురించి మాట్లాడబోతున్నాం.
మనం ఈ విషయాన్ని, స్థిర అసమానత, ఆంగ్ల భాష లో రాయాలని అనుకుంటున్నాను కాబట్టి, ఇటు వంటి విషయాలకు మూల వాక్యాం నమూనా ఈ క్రింది ఇవ్వబడింది.
He is clever.
(వాడు తెలివిగల్లవాడు. (మనకు is తెలుగు లో లేదు. స్థిర మైన గుణాలు మనం కర్తకు ఇట్టే ఆపాదిస్తాం. అదే మన భాష గొప్పతనం.)
మరి మనవాడు ఒక తరగతిలో చదువుతాడు. తెలివి ఒకడి సొత్తు కాదు. కావున అసమానతలు ఉంటాయి.)
Assumption: మన వాడు above average.
He is cleverer than most of the students in his class.
Assumption:
మన వాడు తెలివిలో అందరికంటే తెలివిగల వాడు. అప్పుడు ఎలా రాస్తాం.
He is the cleverest in the class.
Assumption:
మన వాడిని ఇంకొకరితో మాత్రమే పోలుస్తున్నాం. అప్పుడు మన వాడు మొట్టమొదట ఇంకొకడి కంటే తెలివిగల్లవాడు అనుకుందాం.
మనవాడి తెలివి > ఇంకొకడి తెలివి
He is cleverer than Venu.
ఈ వాక్యం ఎలా రాయగలిగామో చూద్దాం.
Clever(He) > Clever(Venu)
> ని than అని రాస్తాం.
> గుర్తుకు అటూఇటూ ఉన్న clever మాట cleverer గా మారుతుంది.
అప్పుడు మనం ఇలా రాయవచ్చును.
He is cleverer than Venu is.
కానీ Venu పక్కన is అనేది అక్కర్లేదు. ఉన్నా తప్పుకాదు. ఆంగ్ల భాష economy of expression కి మారు పేరు. కాబట్టి is ని తొలిగించినా ఆ వాక్యం గ్రామర్ ప్రకారం కరెక్టే.
He is cleverer than Venu (is).
ఇక్కడ మనం రెండు వాక్యాలను compare చేస్తున్నాం కాబట్టి రెండు verbs ఉండవచ్చును. రెండవది తీసివేసిన ఉన్నట్టుగా భావించి అర్థం చేసుకోవాలి. అంతా భ్రమ మరియు మిథ్య కదూ!
రెండవ కేసు:
Clever(he)< clever(venu).
He is less clever than Venu.
( ఇక్కడ less అనగానే cleverer కాస్త clever గా మారింది).
ఇంతక ముందు వాక్యం కూడా ఈ పద్దతి లో కూడా రాయవచ్చును.
He is more clever than Venu (is).
నేను బ్రాకెట్ లో పెట్టిన verb optional.
ఇక్కడ more clever అంటే comparitive degree అనే గమనించాలి.
ఇక చిట్టచివరి కేసు.
Clever (he) = clever (venu)
దీనిని మనం ముందుగా రాసుకుందాం.
as *clever* as
ఈ పైన clever కి బదులు ఏదైనా వాడవచ్చును. ఇది సమానత్వం చూపిస్తుంది. నిజ జీవితంలో సమానతలు చాలా తక్కువ.
He is as clever as Venu(is).
ఇంతక ముందు చెప్పినట్లుగా (is) అనేది optional verb.
సమానత ద్వారా అసమానత ఎలా చెప్పాలి. భలే స్పిన్ వేశాను కదా! 😂
Clever ( he) < clever (venu)
Not as *clever* as
ఇంతక ముందు సమానత phrase ముందు not పెడితే సరిపోతుంది.
He is not as clever as Venu (is).
ఈ విధంగా మనం అసమానతలను ఆంగ్లంలో రాయవచ్చును. సులువుగా ఉంది కదూ! అర్థం చేసుకుంటే ఏది కష్టం కాదు. ఏదైనా అంచెలంచెలుగా వాక్యాన్ని మన భావానికి అనుగుణంగా అల్లుకుంటూ మెల్లగా ఆనందిస్తూ రాయాలి.
Comments
Post a Comment