చాలా మందికి సంతోషానికి మరియు ఆనందానికి అర్థం తెలియదు.
సంతోషం అనేది ఇతరులు మనకు ఇచ్చేది. ఇది లౌకికమైనది మరియు చాలా వరకు అప్రయత్నంగా జరుగుతుంది. ఇది అశాశ్వతం.
ఆనందం అనేది మనకు మనం ప్రసాదించుకునే వరం. ఇది అలౌకికమైనది. ఇది మనం చేసే మంచి ఆలోచనలు, పనులు వలన కలిగేది. దీని పరిధి మనస్సు. కాబట్టి పరిమితి అపరిమితం మరియు శాశ్వతం.
ప్రతి మనిషి తన తోటి మనుషులకు వీలైనంత సంతోషాన్ని కలిగిస్తూ, తనకు తాను విరివిగా ఆనందాన్ని ప్రసాదించుకుంటూ తన జీవితాన్ని ఆనందసంతోషాలతో గడపాలి.
ఇంతకంటే మించిన జీవిత లక్ష్యం మనిషికి అవసరమా?
మరి మీ జీవితంలో మీరు ఇతరులకు సంతోషం కలిగించడానికి ఎన్నుకున్న మార్గాలు ఏమిటి?
మీ ఆనందాన్ని దినదినాభివృద్ధి కోసం ఎన్నుకున్న/పాటిస్తున్న మార్గాలు ఏమిటి?
వీలైతే వీటి మీద నాలుగు మాటలు రాయండి.
Comments
Post a Comment