మనం ఏమి పని చేసిన దాని ఫలితాన్ని పోలుస్తాం. తప్పులేదు . పోల్చుకోవచ్చును. కానీ పక్కవాడి ఫలితంతో పోలుస్తాం. ఇది తప్పు పోలిక నా దృష్టిలో. ఎందుకంటే పక్కవాడి ఫలితం సృష్టిలో అన్నింటి కంటే మెరుగైనదా? కాదు కదా! కాబట్టి ఈ పోలిక ముమ్మాటికీ తప్పు. మరి దేనితో పోల్చుకోవాలి. ప్రతి విషయానికి గరిష్ట పరిమితి సత్యమే. దానితో మాత్రమే పోల్చుకోవాలి. అప్పుడు అది సరైన పోలిక మరి. మన ఫలితం సత్యానికి దూరంగా ఉంది. అంటే మన పని సమర్థవంతంగా లేదని అర్థం. అదే మన పని సత్యాన్ని పోలి ఉంటే అదే సమర్థవంతమైన పనిగా మనం అభివర్ణించవచ్చును.
దీనినే మనం ఆంగ్లంలో effectiveness అంటాం.
మరి పని అంటే, పలుమార్లు చేయవలసి వస్తుంది. చేసిన ప్రతిసారి సమర్థవంతంగా చేశామా? లేదా? చేసిన ప్రతిసారి సమర్థవంతంగా చేశామంటే, మనం ఆ పని చేయడంలో సమర్థత లేక దక్షత సాధించాం అని అర్థం. దీనినే మనం efficiency అని అర్థం.
కాబట్టి ఈ రెండు సంకల్పాలు చాలా ముఖ్యం ఒక మనిషి ఈ సమాజంలో బాగా ఎదిగి పేరు తెచ్చుకోవాలి అంటే.
ఇక ఊహించండి ఒక మనిషి ఒక పెద్ద సంస్థ స్థాపించి దాని సేవలు/వస్తువులు ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేకుండా వేలమంది ఉద్యోగులతో రోజూ చేయిస్తూ ప్రజల మన్ననలు పొందాలంటే ఎటువంటి మెషీన్లు మరియు ప్రణాలికలు రచించి వాటన్నింటినీ సమర్థవంతంగా (effectiveness) మరియు ధక్షతతో (efficiency)నిర్వహిస్తూ ఉంటారో! ప్రపంచం అంతా ఈ రెండు కొలమానాల చుట్టే తిరుగుతుంది. నమ్మలేని నిజం కదూ!
Comments
Post a Comment