తెలుగులో క్రియా రాహిత్యంతో కూడా సరైన వాక్యాలు రాయవచ్చును.
ఉదాహరణ:
రాముడు మంచి బాలుడు.
సీత సౌందర్యవతి.
బాలు ఒక డాక్టర్.
మరి ఇటువంటి భావాలను మరి ఇంగ్లీష్ లో ఎలా తెలపాలి. ఇంగ్లీష్ లో క్రియ లేకుండా మనం వాక్యం రాయలేము. కాబట్టి వారు be verb ని ఆశ్రయించారు.
మరి ఈ be verb ఎందుకు ఇంత కఠినం?
మన తెలుగు భాష చాలా శాస్త్రీయమైన భాష. కాబట్టి మనం ఏదైనా క్రియా పదాన్ని మూల ధాతువు నుండి తయారు చేసుకుంటాము. కాబట్టి ఒక క్రియకు మనకు దాదాపు ఒక 27 రూపాలు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియకుండానే మాట్లాడేస్తూ మరియు రాస్తూ ఉంటాం.
అటువంటి గొప్ప మాతృభాష కలిగిన మనకి ఇంగ్లీష్ verb గురించి సమస్య రావడం సబబే.
నేను ఎక్కడో చదివాను ఫ్రెంచి భాషకు ఒక్కో verb కి అరవై రూపాలు ఉంటాయి అని.
ఇంగ్లీష్ భాషలో అన్ని verbs లేవా అంటే ఉన్నాయి. కానీ వారు ఎన్నుకున్న మార్గం వేరు.
ఈ be verb ని మరియు have verbని మెయిన్ verb కి తగిలించి వివిధ సందర్భాల్లో వారి మెయిన్ verb వాడే సౌలభ్యం సాధించారు.
దీని వలన మన తెలుగు వారికి కొంచెం కష్టం. మన verb నిర్మాణం పద్ధతి వేరు వారిది వేరు కానీ భావ ప్రకటనకు రెండూ భాషలు మనకి బాగా సహకరిస్తాయి అన్నివిధాలా.
ఈ కారణాల వలన be verb irregular verbs కే మకుటం లేని మహారాజు. ఇంగ్లీష్ భాషలో ఏ verb అయినా ఐదు రూపాల్లో ఉంటుంది. కానీ ఈ verb కి 8 రూపాలు ఉన్నాయి.
Be verb యొక్క 8 రూపాలు.
To Be ---> infinitive form
Be --> bare infinitive
Am, is are --> present tense (singular, plural)
Was were --> past tense ( singular, plural)
Being --> present participle
Been --> past participle
మనం regular మరియు irregular verbs గురించి మాట్లాడుకున్నాం. ఈ క్రింది ఉదాహరణలు చూస్తే మనకు be verbని ఎందుకు irregular verbs కి రారాజు అంటారో అనే విషయం నిర్ధిష్టంగా తెలిసిపోతుంది.
Irregular verb:
To see infinitive
See. Bare infinitive
See present tense
Saw. Past tense
Seeing present participle
Seen past participle
ఒక్క be కి మాత్రమే bare infinitive మరియు present tense రూపం వేరు వేరుగా ఉంటుంది. కావున be verb ని వీరు అలా రూపొందించారు. ఇది verb phrases లో catalyst లాగా బాగా పనిచేస్తుంది. కాబట్టి be సహాయంతో verb phrases ఎలా తయారు చేస్తారు మరి ఆ verb phrase లో దాని పాత్ర ఏంటి? అది మనకు ఏమి తెలియజేస్తుంది అనే విషయాలు బాగా చదవాలి ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అంటే.
Regular verb ఒక దానిని చూద్దాం.
To talk --> infinitive
Talk. --> bare infinitive
Talk --> present tense
Talked --> past tense
Talking --> present participle
Talked --> past participle
ఇంగ్లీష్ లో ప్రతి verb కి 5 forms ఉంటాయి కానీ be verb కి మాత్రం 8 forms ఉంటాయి.
Comments
Post a Comment