మనం తెలుగు భాషలో క్రియ లేకుండా వ్యాకరణ బద్దంగా వాక్యాలు రాయవచ్చును. ఈ క్రింది కొన్ని ఉదాహరణలు ఇవ్వబడినవి.
అతను డాక్టర్.
వాడు ఇంజనీర్.
రావణుడు క్రూరుడు.
మరి పైన పేర్కొన్న కోవలోకి చెందిన భావాలను మనం ఇంగ్లీషు లో సులువుగా చెప్పగలమా? అయితే ఏలా చెప్పాలి? దానికి మనకున్న సౌలభ్యం ఏంటి? ఈ ప్రశ్నలు జనాల మనస్సులలో మెదలటం సహజం.
ఈ పై పేర్కొన్న భావాలను మనం ఇంగ్లీషు లో వ్యక్తీకరించడం సులువు. ఇంగ్లీష్ verb centric భాష. కాబట్టి మనం ఇంగ్లీషు verb గురించి పైపైన రెండు మాటలు చెప్పుకోక తప్పదు.
ఒక ఇంగ్లీషు వాక్యం లో ఉన్న verb మనకు action అన్నా సూచిస్తుంది లేదా state (స్థితిని) అన్నా సూచిస్తుంది.
మన తెలుగు లో క్రియా రాహిత్యంతో రాయబడిన పై వాక్యాలను తిరిగి పరిశీలించిన అవి తమ కర్త యొక్క స్థితిని తెలియజేస్తున్నాయి. ఈ స్థితి కర్త యొక్క మానసిక స్థితి కానీ రూపురేఖలు కానీ ఆర్థిక స్థితి లాంటి మున్నగునవి సూచిస్తాయి.
మనందరికీ = అనే లెక్కల సింబల్ బాగా పరిచయం కదూ. x = 5 అంటే మనందరికీ తెలుసు x అనే లెక్కల variable విలువ ఇప్పుడు 5 అయ్యింది అని. ఈ background తో
మనం పైన రాసిన మూడు తెలుగు వాక్యాలను ఈ క్రింది విధంగా రాసుకుందాం.
అతను = డాక్టర్.
వాడు = ఇంజనీర్.
రావణుడు = క్రూరుడు.
క్రియా రాహిత్యంతో ఉన్న తెలుగు వాక్యాలలో = sign జొప్పించాను. దీని వలన భావం ఏమి మారలేదు. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే ఈ పై వాక్యాలలో స్థితి సంబంధించిన వారిది మనం మన మనస్సులో కట్టుకుంటున్నాము.
= Mathematical sign ని ఇంగ్లీష్ లో మనం "is equal to" అంటాం.
అంటే మనం క్రియ రాహిత్యంతో తెలుగు లో రాసుకునే వాక్యాలను ఇంగ్లీష్ లో to-be family verb సహాయంతో verb centricity తీసుకుని వచ్చి రాయవచ్చును కదూ.
రెండవ అంశం: ఒక వ్యక్తి ఎంతో కష్టపడి కష్టాలకు నష్టాలకు ఓర్చుకుని ఒక స్థాయి సాధిస్తాడు. ఇందులో = గుర్తుకి రెండువైపులా మనం నామవాచకమే చూస్తున్నాం. నామ వాచకాన్ని ఇంగ్లీష్ లో noun అందురు.
వేణు = ఇంజనీరు.
పై వాక్యాన్ని మనం abstract sense లో ఆలోచించి దానిలోని నిగూఢమైన నమూనాను లాగితే ఈ క్రింది sentence pattern మనకు అంతర్లీనంగా అగుపడుతుంది.
Sentence pattern1:
N1 = N2. ==> N1 be N2. Pattern 1.
మనం ఒక noun ని రెండవ noun తో rename చేయాలి అనుకున్నప్పుడు వాడాల్సిన sentence pattern ఇది.
మనం రాసుకున్న చివరి వాక్యాన్ని పరిశీలిస్తే ఈ క్రింది విషయం అవగతమౌతుంది.
రావణుడు= క్రూరుడు.
Noun = adjective (విశేషణం). అంటే మనం ఒక కర్తకు ఏదైనా స్థిరమైన గుణం ఆపాదించాలి అంటే ఈ sentence pattern వాడవలసిన వస్తుంది.
పై వాక్యాన్ని మనం abstract sense లో ఆలోచించి దానిలోని నిగూఢమైన నమూనాను లాగితే ఈ క్రింది sentence pattern మనకు అంతర్లీనంగా అగుపడుతుంది.
Sentence pattern2:
N1 = Adj. ==> N1 be Adj Pattern 2.
మూడవ అంశం:
మనం తెలుగులో ఈ క్రింది ఇవ్వబడిన వాక్యాలను కూడా విరివిగా వాడుతుంటాం.
విద్యార్థులు పైన ఉన్నారు.
ఇక్కడ టీచర్ ఉంది.
నా చివరి ప్రోగ్రాం నిన్న జరిగింది.
నా వచ్చే ప్రోగ్రాం వచ్చే సోమవారం.
ఇక్కడ మనం కర్త యొక్క స్థలం మరియు సమయం గురించి సమాచారం ఇస్తున్నాం.
పై వాక్యాలని మనం abstract sense లో ఆలోచించి దానిలోని నిగూఢమైన నమూనాను లాగితే ఈ క్రింది sentence pattern మనకు అంతర్లీనంగా అగుపడుతుంది.
Sentence pattern3:
N1 = Adverb of Place or Time. ==>
N1 be Adverb of place or Time Pattern 3.
ఈ విధంగా be family verbs in main verbs గా పైన పేర్కొన్న మూడు సందర్భాల్లో వాడవచ్చును.
Comments
Post a Comment