మన సొసైటిని గనుక గమనిస్తే అది కొన్ని కోట్ల కుటుంబాల కలయిక. ప్రతి కుటుంబం ఈ సొసైటీ కి ఎంతో ముఖ్యం. అలాగే ఇంగ్లీష్ భాషలో ఎన్నో verbs కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యులు ఉన్నట్టే ఒక verb కుటుంబంలో కూడా verb కి సంబంధించిన సభ్యులు ఉంటారు. ప్రతి కుటుంబానికి పేరు ఉన్నట్లే ప్రతి verb కుటుంబానికి ఒక పేరు ఉంటుంది. మనం ఒక మానవ కుంటుంబం గురించి తెలుసుకోవాలి అంటే అందులో ప్రతి సభ్యుడు గురించి తెలుసుకోవాలి. అలానే ఒక verb family లో ఉన్న ప్రతి verb గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని verb families గురించి తెలుసుకోగలమో దానిని బట్టి మన పట్టు ఇంగ్లీష్ భాష మీద ఉంటుంది.
ఈ పై భావనను ప్రాతిపదికగా తీసుకుని మనం మన పరిచయాన్ని "To Be" verb family తో ఈ బ్లాగ్ లో పెంచుకుందాం.
To Be verb family అనేది ఇంగ్లీష్ భాషలో అతి ముఖ్యమైన family. దీని ఇంటి పేరు To be. ఈ verb family verbs ని మనం రెండు విధాలుగా వాడుతాము.
1. వాక్యం లోని కర్త యొక్క స్థితిని మరియు గుణగణములను సూచించడానికి. అంటే ఒక main verb గా అన్నమాట.
2. ఇంకొక main verbకి helping verb గా ఈ క్రింది అంశాల్లో to be family verb ని వాడవచ్చును.
2.a. కర్త యొక్క actionని కాలాను సారంగా చూపించడానికి,
2.b. ప్రశ్నలు వేయడానికి,
2.c. action verb ని negation చేయడానికి,
2.d.కర్మార్థక వాక్యాల యొక్క verb phraseతయారు చేయడానికి,
2.e.వాస్తవమైనవే కాకుండా అవాస్తవమన విషయాలు తెలపడానికి
పైన పేర్కొన్న అంశాలను బట్టి మనం to be verb family గురించి ఒక అంచనాకు రావచ్చు. ఇది అతి ముఖ్యమైన verb family ఇంగ్లీష్ భాషలో అని.
ఇంగ్లీష్ భాషలో verbs ని అవసరం కొద్ది వాటిని రకరకాలుగా విభజన చేస్తుంటారు. మనకు తెలుసు మన భాషలో కూడా verb తన రూపాన్ని కాలము, కర్త యొక్క పురుషము లింగం, వచనం బట్టి మార్పు చెందుతుంది. ఇటు వంటి మార్పులే ఇంగ్లీష్ verb లో కూడా జరుగుతాయి. ఇంగ్లీష్ భాషలో మార్పులు నాకు తెలిసి సులువు మన భాషతో పోల్చి చూస్తే.
ఇంగ్లీష్ లో verb spelling మార్పులు ఒక పద్దతి లో జరిగితే వాటిని regular verb అనియు లేకపోతే వాటిని irregular verbs అనియు అంటారు.
మనం ప్రస్తుతం చదివే to be family verb అతి క్లిష్టమైన irregular verb. It is the king of the irregular verbs in English language.
To be. -- To అనే ఇంగ్లీష్ మాట be verb ముందు ఉంటే, దానిని infinitive form of be verb అని అంటారు. మనం మన వాడుక భాషలో ఇంటి పేరు అనుకోవచ్చును.
To be లోంచి To మాట తొలిగిస్తే, దానిని bare infinitive అంటారు. Be ఒక bare infinitive.
Am, is are వీటిని మనం present tense forms of be verb అని చెప్పుకోవచ్చును.
గమనిక: ఒక్క be verb కి తప్పించి మిగతా ఇంగ్లీష్ భాష verbs కి bare infinitive and present tense forms ఒక్కటే. ఇక్కడ ఒక్క చిన్న చిక్కు ఉంది అదే "s" form of the verb for he/she/it. అంటే ఒక additional present tense form of verb మనం గుర్తుంచుకోక తప్పదు.
Was, were వీటిని మనం past tense forms of be verb అని చెప్పుకుంటాం. తప్పదు రట్టు కొట్టాల్సిందే.
Been ని past participle గా చెప్పుకోవచ్చును. దీనిని ముఖ్యంగా complex tenses verb phrase formation లో వాడుతారు.
Being ని present participle అంటారు. ఈ present participle మాత్రం ఒక పద్దతిలో జరుగుతుంది ఇంగ్లీష్ లో. దీనికి formula: present participle of any verb = Bare infinitive of the verb + "ing".
Comments
Post a Comment