తెలుగు భాషలో ప్రేరణార్థక క్రియలు నిత్యం జీవితంలో మనం వాడుతూనే ఉంటాం. వాటిని మనం వాడకపోతే మనం సాధించిన విజయాలు బహుశా సాధించలేకపోయే వారమేమో! ఇవి అంత గొప్ప క్రియలు.
మనం కొన్ని పనులు సొంతంగా మరి కొన్ని పనులు ఇతరుల చేత చేయిస్తూ ఉంటాం. ఎందుకంటే అన్నీ పనులు మనం చేయలేం కనుక. కొన్ని సార్లు పనులు మనం చేయగలిగిన ఇతరులతో చేయిస్తాం వారిని ప్రేరేపిస్తూ. ఇప్పుడు ఈ బ్లాగు కూడా మిమ్మల్ని ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించమని ప్రేరేపిస్తుంది కదూ! ఈ క్రియలు అంత ముఖ్యం మరి.
ప్రేరణకు ఉపయోగించే క్రియలను ప్రేరణార్థక క్రియలు అంటారు. మన తెలుగు భాషలో క్రియా ధాతువుకు ఇంచు అనే ప్రత్యయము చేరిస్తే ప్రేరణార్థక క్రియ తయారవుతుంది.
ఉదాహరణలు:
పిలిపించు, అడిగించు, కొనిపించు, చదివించు మున్నగునవి.
ఉదాహరణ వాక్యాలు:
1. ఉపాద్యాయుడు విద్యార్థులను చదివించెను.
2. చిన్నపిల్లవాడు అమ్మచే బొమ్మ కొనిపించెను.
3. పూజారి దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయించెను.
ఈ విధంగా మనం మన పనులను రోజూ మనం చేయకుండా ఇతరుల చేత మన ప్రేరణతో చేయిస్తూనే ఉన్నాం. లేకపోతే మనం ఈ జీవితం సాఫీగా సాగదు.
ఇప్పుడు ఈ ప్రేరణార్థక క్రియను ఇంగ్లీష్ భాషలో ఎలా ఉపయోగించాలి. దీనికి మనం has family verb యొక్క మద్దతు తీసుకోవాలి.
మరి ఈ ప్రేరణార్థక క్రియను ఇంగ్లీష్ లో ఏమంటారు?
వీటిని causative verb forms అంటారు.
ఏ భాషలో అయినా మనం కొన్ని కొత్త అంశాలు చెప్పుకోవాలి అంటే కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలను కూడా మిళితం చేసి చెప్పుకుంటాం. భాషను మనం ఎన్ని సార్లు చదివితే అంత బాగా అర్థం అవుతుంది. ఏ భాష అయినా సముద్రమే. దీనిని ఆది అంతం అంటూ ఉండదు. కాబట్టి కొన్ని ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలను వాడితే, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి causative verb forms లో అన్ని రకాల English tenses వాడటం జరుగుతుంది. వాటి గురించి మనం ఇంకా ఏమి చెప్పుకోలేదు. కాబట్టి tenses గురించి బ్లాగ్ లో చదివిన తరువాత మరళా ఈ బ్లాగు చదవడానికి ప్రయత్నించాలి. భాష ను చదివేటప్పుడు ఒక నిర్థారించిన route map అంటూ ఉండదు.
The causative form is used when we don't do something ourselves but arrange for someone else(usually an expert) to do it for us. Of course, that expert charges us money for the service rendered.
How do we form causative sentences?
We can use the following sentence pattern for it.
Subject + have+ object+ past participle
Example:
He had his car serviced (by a car mechanic) last week.
ఇక్కడ
Subject = He
Have = Had
Object = his car
Past participle= serviced
(By a car mechanic ) అనేది optional
Last week = adverb of past time. దాని వలన have verb past tense had ను ఉపయోగించడం జరిగింది.
కర్త తను పని చేస్తే అది active voice అంటారు. అదే కర్త ప్రేరేపిస్తే దానిని causative form అంటారు.
మనం ఈ పద్దతి లో కొన్ని ఉదాహరణలను చూద్దాం.
Tense: Present simple
Active voice: We paint our house every year.
Causative form: we have the house painted every year.
ఈ causative form ని మనం simply పైన పేర్కొన్న sentence pattern ని tense కి అనుగుణంగా వాడటం జరిగింది.
Tense: present progressive
Active voice: I am washing my car.
Causative form: I am having my car washed.
ఇక్కడ am having అనేది పైన పేర్కొన్న tense ని ప్రతిబింబిస్తుంది.
Tense: Past simple
Active voice: He typed three letters yesterday.
Causative form: He had three letters typed yesterday.
Tense: present perfect
Active voice: The boys have repaired their cycles.
Causative form: The boys have had the cycles repaired.
Imperative:
Active voice: clean the table, please.
Causative form: Have the table cleaned, please.
ఇక్కడ subject you implicit.
మీరు కొన్ని sentences active voice లోను మరియు దానినే causative form లో రాయడానికి ప్రయత్నించండి. మీరు అన్ని tenses లో causative forms రాయగలిగితే ఇంకా మంచిది. ఇదే subject మీద hold కి తార్కాణం.
Comments
Post a Comment