మనం తరుచూ ఈ వాక్యం జనాల నుంచి వింటూంటాం “నేను ఏమి చెప్పాలో మాటల్లో చెప్పేస్తాను కానీ దానిని రాయలేను”. రాయాలంటే మాటల కూర్పు అనేది మాకు తెలియదు. కాబట్టి వారు తరుచుగా ఫోనులో అయిన మాట్లాడుతారు లేదా వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. దీనికి ముఖ్య కారణం భాషలో వాక్యం యొక్క నిర్మాణంలో పదాల కూర్పు తెలియకపోవడమే. దీనిని ఇంగ్లీషులో syntax అంటారు. ఇంగ్లీషు భాషలో ఈ వాక్య నిర్మాణ పదాల కూర్పు మీద 250 వాక్య నమూనాలు ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు భాష కొద్ది వెనుకబడింది అనే అనుకోవాలి. ఈ బ్లాగులో కొన్ని ముఖ్యమైన వాక్యం కూర్పు నమూనాలు చూద్దాం. దాంతో మన జనాల వాక్యం కూర్పు భాధలు కాస్త తొలగవచ్చును అనే ఆశయంతో ఈ బ్లాగ్ రాస్తున్నాను.
ఇప్పుడు మనం తెలుగు విభక్తుల గురించి తెలుసుకుందాం. తెలుగులో విభక్తులు వాక్యం లో రెండు పదాలు మధ్య relationship గురించి తెలుపుతుంది. విభక్తులను మనం English భాషలోని cases కి సమంగా చూడవచ్చును. అదే విభక్తి ప్రత్యయాలను (suffixes) మనం English భాష లోని prepositions కి సమంగా చూడవచ్చును with order reversed. ఇది ఒక పెద్ద twist English భాష నేర్చుకోవాలనుకున్న తెలుగు వారికి. English ద్వారా తెలుగు నేర్చుకోవాలి అన్న వారి సౌలభ్యం కోసం మనం వీటిని postpositions అని అన్నాం. English లో preposition అంటే ఒక noun కి కానీ pronoun కి కానీ ఒక noun equivalent లేదా substantive కి ముందు పెట్టేది అన్నమాట. తెలుగు లో ఈ postposition అనగా noun or pronoun oblique stem తరువాతనే వస్తుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మనం ఈ oblique stem గురించి రాబోయే paragraph లో నేర్చుకుందాం.
ఇప్పుడు తెలుగు విభక్తులు English case ల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం.
ప్రథమా విభక్తి ===> Nominative/ Subjective case
ద్వితీయ విభక్తి===> Objective/Accusative case
తృతీయ విభక్తి ===> Instrument case
చతుర్థి విభక్తి ===> Dative case
పంచమీ విభక్తి===> Ablative case
షష్ఠీ విభక్తి===> Genitive/ Possessive case
సప్తమీ విభక్తి===> Locative case
సంభోథన ప్రథమా విభక్తి===> Vocative case
ఈ విధంగా మనం తెలుగు విభక్తులు మరియు వాటికి సంబంధించిన English cases ల వివరాలు పై పట్టికలో చూశాం కదా.
గమనిక: English భాష తెలుగు లేదా హిందీ లాంటి భాషలతో పోల్చి చూస్తే కొద్దిగా దాని మాటల్లో అన్ని మార్పులు జరగవు. English words are less inflectional compared to Telugu. దీని వలన ఈ భాషలో కొన్ని cases మాత్రమే ఉన్నాయి : Nominative case, objective case and possessive case. Dative case లో noun లో కూడా objective case మార్పు మాత్రమే ఉంటుంది. Nouns విషయానికి వస్తే Nominative case మరియు objective case word spelling ఒకటే. ఈ విషయం తెలుగు భాష కు వర్తించదు. తెలుగు highly inflectional language. మనకు తెలుగు వస్తే మరి English చాలా సులువుగా రావాలి. కానీ అలా జరగటం లేదు. దీనికి కారణం తెలుగు వ్యాకరణ బద్దంగా తెలియకపోవడమే.
ఒక మాట – నామ వాచకం కానీ సర్వ నామం కానీ – అది వాక్యం లో వాడే case బట్టి అది రూపాంతరం చెందుతుంది. దీనికి ఏ భాష కూడా మినహాయింపు కాదు.
తెలుగు లో ఒక మాట ప్రథమా విభక్తి లో వాడితే అది మారినా మనం ద్వితీయ విభక్తి లో వాడినపుడు దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ మేరకు ఆ విభక్తి ప్రత్యయం జోడించడం జరుగుతుంది. మనం ఈ విషయం ఈ క్రింది పేరాలో నేర్చుకుందాం.
తెలుగు భాషలో వాక్యం లోని పదాలు మధ్య సంబంధాన్ని ప్రస్ఫుటం చేయడానికి మనం విభక్తులు వాడుతుంటాం. ఒక నామవాచకం కానీ సర్వ నామం కానీ ద్వితీయ విభక్తి లేక వేరే విభక్తులు లో అంటే సప్తమీ విభక్తి వరకు వాడితే దానికి కొన్ని సందర్భాల్లో ఉప విభక్తులు కలిపి వాటి oblique stem తయారు చేయాలి. ఈ oblique stemని తెలుగులో విభక్తి ప్రాతిపదిక అని లేదా ద్వితీయాది విభక్త్యంగం అంటారు. ఈ విధంగా తయారైన oblique stem కి మనం విభక్తులను కలపాలి.
Oblique stem = Nominative case + ఉప విభక్తులు
Objective case to locative case noun or pronoun = oblique stem + respective case విభక్తి.
ఈ విధంగా ఒక case కోసం తయారైన noun కానీ pronoun కానీ
( ఆ noun or pronoun oblique stem + ఆ case కి సంబంధించిన ప్రత్యయం ) దానికి వాక్యంలో నిర్దేశించిన స్థానంలో వాడాలి. ఈ పైన పేర్కొన్న సూత్రం బాగా గుర్తుంచుకోవాలి.
ఉదాహరణ:
Case ఏకవచనం. బహువచనం
Nom. రాముడు. రాములు
Obj. రాముని. రాముల
Inst. రామునిచే/తో. రాములచే/తో
Dat. రాముని కొరకు/కై. రాముల కొరకు/కై
Abl. రాముని వలన/కంటే. రాముల వలన/కంటే
Gen. రాముని యొక్క. రాముల యొక్క
Loc. రాముని యందు రాముల యందు
Voc. ఓ రాముడా! ఓ రాములారా!
Oblique stem అనేది vocative case కి వర్తించదు.
ఇక్కడ రాముడు కి ఏకవచనం oblique stem రాముని అదే విధంగా బహువచనం oblique stem రాముల.
ఈ oblique stem formation rules ని మనం ప్రత్యేకమైన బ్లాగులో “nouns part3” బ్లాగులో చూద్దాం.
ఇప్పుడు మనకు oblique stem ఎలా శాస్త్రీయంగా ఏర్పడుతుందో చూశాము. ఈ basic knowledge తో మనం తెలుగు వాక్యాల నమూనాలు కొన్ని చూద్దాం.
తెలుగు వాక్యం నమూనాలు:
సాధారణంగా తెలుగు భాషలో వాక్యం కూర్పు ఈ క్రింద పేర్కొన్న పద్ధతిలో ఉంటుంది.
కర్త కర్మ క్రియ.
కర్త అంటే source of the action. క్రియను చేసేవాడు.
కర్మ అంటే ఆ క్రియ ఫలితం పొందేవాడు. Destination of the action.
క్రియ అంటే కర్త చేసిన పని.
ఈ వాక్యం నమూనా అన్నింటికీ మూలం. ఈ నమూనాను మనం సందర్భసహితంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోవాలి.
వాక్యుల నమూనాలు:
Nominative case ముందు వస్తుంది మరియు క్రియ చివర వస్తుంది. తెలుగులో క్రియ స్థానం వాక్యం చివర మార్పు లేకుండా ఉంటుంది.
ఉదాహరణలు:
రాముడు వెడతాడు.
రాముడు చదువుతున్నాడు.
రాముడు తింటున్నాడు.
Accusative case Nominative మరియు క్రియ మధ్యలో వస్తుంది.
ఉదాహరణలు:
రాముడు పాలను తాగుతున్నాడు. ( ఇక్కడ పాలు అనేవి నిత్య బహువచనం కావున దాని oblique form పాల అవుతుంది. దానికి మనం ద్వితీయ విభక్తి ప్రత్యయం ని చేర్చాం.)
రాముడు పుస్తకంని చదువుతున్నాడు.
రాముడు టీవిని చూస్తున్నాడు. ( Oblique stem అనేది కొన్ని పదాలకు Nominative case పదం లాగానే ఏ మార్పు లేకుండా ఉంటాయి.)
Dative case సాధారణంగా Accusative case ముందు వస్తుంది.
ఉదాహరణలు:
రాముడు బిచ్చగాడి కొరకు ఒక పండుని ఇచ్చాడు. (ఈ రోజుల్లో కోరకు బదులు కోసం లేదా కి అని కూడా వాడుతున్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది case positioning in the sentence)
జనకుడు రాముని కొరకు సీత నిచ్చెను.
రాముడు హనుమంతుని కొరకు అమరత్వమును ప్రసాదించెను.
Instrument case కానీ Ablative case కానీ Accusative case ముందు వస్తాయి.
ఉదాహరణలు:
రాముడు తుపాకితో దొంగను కాల్చాడు.
రాముడు బాణము చేత వాలిని చంపెను.
రాముడు శూర్పణఖ వలన రావణాసురుడిని చంపవలసి వచ్చింది.
రాముని కంటే గొప్ప విలుకాడు లేడు.
Genitive case రెండు nouns మధ్య సంబంధం తెలిపేటప్పుడు వాడుతుంటాం
ఉదాహరణలు:
రాముని యొక్క కూమారుడు నాకు స్నేహితుడు. ( ఈ మధ్య రాముని కుమారుడు అని వాడేస్తున్నారు.)
రాముడు రేపటికి మన ఊరికి చేరుకుంటాడు.
రాముడు తమ అన్నదమ్ముల లోపల గొప్ప విలుకాడు.
Locative case వాక్యం ముందు కానీ లేదా వాక్యాం మధ్యలో కొన్నిసార్లు వస్తుంది.
ఉదాహరణలు:
నదీ తీరమందు ఒక పెద్ద చెట్టు ఉంది.
రాముని జేబు నందు ఏముంది?
అన్ని దిక్కుల యందు విష్ణువు ఉన్నాడు
Vocative case వాక్యం ముందు వస్తుంది కావున oblique stem అనే concept దీనికి వర్తించదు ఎందుచేతనంటే దీని విభక్తి ప్రత్యయం noun ముందు వస్తుంది. ఈ case సర్వనామాలకు వర్తించదు.
ఉదాహరణలు:
ఓ రాముడా! ఎక్కడ ఉన్నావు తండ్రి?
ఓరి రాములారా! మీరు మా గోడు వినరా?
Comments
Post a Comment