తెలుగు వాక్యంలోని ఒక నామ వాచక పదానికి మరియు ఇంకొక పదానికున్న సంబంధాన్ని మనం విభక్తులతో సూచిస్తాం. అయితే మన నామ వాచక పదం ద్వితీయేతర విభక్తి లో ఉంది అనుకుందాం. అప్పుడు ఆ పదానికి విభక్తి ప్రత్యయాలు చేర్చాలి అంటే ఆ నామ వాచక పదానికి ముందుగా మనం ఉప విభక్తులను కలిపి ఆ విధంగా మార్పు చెందిన పదానికి విభక్తి ప్రత్యయాలను కలపాలి. ఈ విభక్తి ప్రత్యయాలు కలిపే ముందు ఉన్న ఆ నామవాచక రూపాన్ని మనం ఔపవిభక్తిక రూపం లేదా ద్వితీయాది విభక్త్యంగం అని అంటారు. ఈ ఉప విభక్తులను ఔపవిభక్తులు అని కూడా అంటారు. ఈ నామ వాచకం యొక్క ఔప విభక్తిక రూపంను oblique stem అని English భాషలో అంటారు. ఈ ఉప విభక్తులు కొన్ని నామవాచకాలకు అవసరం మరియు కొన్నింటికి అనవసరం. అనవసరం అన్న చోట ప్రథమా విభక్తి రూపంకే విభక్తి ప్రత్యయాలు కలపడం జరుగుతుంది.
ఉదాహరణ:
కన్ను ( నామ వాచకం) + లో (షష్ఠీ విభక్తి ప్రత్యయం) = కంటిలో
మరి కన్ను కంటి ఎలా మారింది? ఈ కంటి నే కన్ను అనే నామవాచకం oblique stem. ఈ విధంగా ఒక నామవాచకం విభక్తి ప్రత్యయాలు తీసుకోడానికి ముందు కొన్ని సార్లు తన రూపాన్ని ఉప విభక్తుల ద్వారా మార్చుకుని ఆ తర్వాత విభక్తి ప్రత్యయాలు తీసుకోవాలి. కొన్ని సార్లు ఉప విభక్తుల అవసరం లేకుండా నే మనం విభక్తి ప్రత్యయాలు కలిపేయవచ్చును. వీటి గురించి మనం ఈ బ్లాగులో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఈ ప్రక్రియ నామ పదాలు అంటే నామవాచకం, సర్వ నామం కు మరియు విషేషణాల పదాలకు వర్తిస్తుంది. మనం నామవాచకం వరకే ఈ బ్రాగులో చూస్తాం.
ఇదే ప్రక్రియను English భాష లో cases అని అంటారు. తెలుగు భాషతో పోల్చి చూస్తే English nouns (నామవాచకాలు) అంత మార్పుచెందవు. ఈ noun word spelling మార్పు case పరంగా జరిగేదానినే inflection/declension అని అంటారు. ఇటువంటి inflection మనం noun singulars మరియు plurals లో చూశాం ఇంతక మునుపు బ్లాగులో.
మనం ముందుగా తెలుగు నామవాచకాల ఔపవిభక్తికాలు చూసి ఆ మేర English భాషలో nouns different cases కి ఏ విధంగా మార్పు చెందుతాయో చూద్దాం.
ఈ క్రింది పట్టికలో తెలుగు భాష విభక్తి ప్రత్యయాలు ఇవ్వబడినాయి. ప్రతి తెలుగు విభక్తికి దాని English equivalent case కూడా ఇవ్వబడింది. తెలుగులో ఉన్నన్ని case లు English భాషలో లేవు. కాబట్టి మనం English less inflectional language అని కూడా అనుకోవచ్చును.
విభక్తి ప్రత్యయాల పట్టిక( ఇక్కడ న్ తో కూడిన ద్రుతం ను విభక్తి ప్రత్యయాలలో చూపించ లేదు. ఆదునిక భాషాలో ద్రుత ప్రయాగం పూర్తిగా తగ్గిపోయింది):
ప్రథమా విభక్తి( Nominative case):
డు, ము, వు, లు/ రు
ద్వితీయ విభక్తి( Objective/ Accusative case):
ను/ని, కూర్చి, గురించి
తృతీయ విభక్తి( Instrument case):
చేత/చే, తోడు/తో
చతుర్థీ విభక్తి( Dative case):
కొరకు, కై
పంచమీ విభక్తి( Ablative case):
వలన, కంటే, పట్టి
షష్ఠీ విభక్తి ( Genitive/ Possessive case):
కు, యొక్క, లో/లోపల
సప్తమీ విభక్తి ( Locative case):
అందు/అ, నా
సంబోధన ప్రథమా విభక్తి( Vocative case):
ఓం, ఓయి, ఓరి, ఓసి
‘ఇ-టి-ంటి-తి-అ’ అనేవి ఉప విభక్తి ప్రత్యయాలు. ఇవి ఏ విధంగా అచ్చ తెలుగు నామవాచక పదాల్లో చేరుతాయో ఈ క్రింది 6వ సెక్షన్ లో తెలుసుకుందాం.
Oblique stem ఎర్పరుచుటకు తెలుగు భాషలో ఉన్న నామ వాచక పదాల్ని ఆరు విధాలుగా విభజింపవచ్చును.
డు అంతంగా ఉన్న పదాలు
రాముడు, తమ్ముడు, మగడు
బహువచనం లు కలిగిన పదాలు
రాములు, హరులు, త్రాళ్ళు
ము అంతంగా ఉన్న పదాలు
వనము, బియ్యం
వు అంతంగా ఉన్న పదాలు
తెరువు, ధేనువు, ఆవు, వధువు
విభక్తి రహితములు
హరి, దొర
ఔప విభక్తి అంతంగా ఉన్న పదాలు
గోయి, నేయి, కన్ను
ఇప్పుడు పైన పేర్కొన్న oblique stem తయారు చేయు types ని సవివరంగా ఒకొక్క దాని గురించి తెలుసుకుందాం.
డు అంతంగా ఉన్న పదాలు:
అ అక్షరము ముందుగా లేని, లింగాన్ని భోధించే ‘డు’ అక్షరం చివర కలిగిన పదాలకు ద్వితీయ మరియు మిగతా విభక్తుల ప్రత్యయములు కలిసినపుడు, డు అక్షరం లోపించి ని అక్షరం దానికి substitute గా వచ్చును.
ఉదాహరణ:
రాముడు + ను (ద్వితీయ విభక్తి ప్రత్యయం) = రాముని + ను = రాముని
రాముడు + చేత = రాముని చేత
ఇక్కడ రాముని రాముడు అనే పదానికి oblique stem. మనం ద్వితీయేతర విభక్తుల ప్రత్యయాలు దీనికే కలుపుతాం.
అ అక్షరం ముందుగా ఉండు, డు చివరి కలిగిన పదాలకు ని అక్షరం ఎప్పుడూ వచ్చును
ఉదాహరణ:
రంగడు + ను = రంగని
రంగడు + చేత = రంగని చేత
ఇక్కడ రంగని రంగడు అనే పదానికి oblique stem. మనం ద్వితీయేతర విభక్తుల ప్రత్యయాలు దీనికే కలుపుతాం.
బహువచనం ‘లు’ కలిగిన పదాలు
ఏ పదానికైనా దాని బహువచనం రూపంలో ‘అ’ చేరుతుంది.
ఉదాహరణ:
రాములు – రాముల
రంగడులు – రంగడుల
కాళ్ళు – కాళ్ళ
చేతులు – చేతుల
ఇప్పుడు మనం పైన పేర్కొన్న రెండింటినీ బట్టి ఒక పూర్తి ఉదాహరణ తెలుగు భాష లో ఉన్న అన్ని విభక్తి ప్రత్యయాలను వాడి ఈ క్రింది పట్టికలో చూద్దాం.
ఏకవచనం: రాముడు. దీని oblique stem: రాముని
బహువచనం: రాములు. దీని oblique stem: రాముల
Case ఏకవచనం. బహువచనం
Nom. రాముడు. రాములు
Obj. రాముని. రాముల
Inst. రామునిచే/తో. రాములచే/తో
Dat. రాముని కొరకు/కై. రాముల కొరకు/కై
Abl. రాముని వలన/కంటే. రాముల వలన/కంటే
Gen. రాముని యొక్క. రాముల యొక్క
Loc. రాముని యందు రాముల యందు
Voc. ఓ రాముడా! ఓ రాములారా!
Note: vocative case లో nominate case నామవాచకం పదంని తీసుకుని దాని చివరి అచ్చును దీర్ఘంగా రాసి, ఆ పదంకు ముందు సరైన విభక్తి ప్రత్యయం లింగం మరియు వచనం ప్రకారం పెట్టాలి.
Exception: పదాలు ఉ అచ్చుతో కనుక అంతం అవుతూ ఉంటే దీర్ఘంగా ఆ ని ఉపయోగించాలి.
ఈ vocative case కి oblique stem concept apply అవ్వదు.
ఉదాహరణ:
పులి – పులీ (ఇ → ఈ)
బిడ్డ – బిడ్డా (అ —> ఆ) ( ఓ బిడ్డా)
తమ్ముడు – తమ్ముడా (ఉ → ఆ) (exception) ( ఓ తమ్ముడా)
ము అంతంగా ఉన్న పదాలు మరియు వు అంతంగా ఉన్న పదాలు
ము అంతంగా మరియు వు అంతంగా ఉన్న పదాల యొక్క oblique stem ఏ మార్పు లేకనే ఏర్పడును.
ఉదాహరణ:
గుర్రము + ను = గుర్రములు
గుర్రము + చేత = గుర్రము చేత
సప్తమీ విభక్తి ప్రత్యయం ‘అందు’ ఈ ము అంతం/వు అంతం పదాలతో పరమైనపుడు ను సంధి చేసిన రూపం లేక సంధి లేని రూపం వచ్చును.
ఉదాహరణ:
వనము + అందు → వనమునందు, వనమందున
ధేనువు + అందు → ధేనువునందు, ధేనువందున
షష్ఠీ విభక్తి ప్రత్యయమైన కు కలిసినపుడు ఉకార, ఋకారములకు ను additional (ఆగమము) గా వస్తుంది.
ఉదాహరణ:
విష్ణువు + కు → విష్ణువునకు
గుర్రము + కు → గుర్రమునకు
లు-ల-న లు కలిసినపుడు ము అక్షరం పోయి దాని ముందు ఉన్న అక్షరం దీర్ఘంగా వచ్చును.
ఉదాహరణ:
గుర్రము + న → గుర్రాన
గుర్రము + నకు → గుర్రానికి
విభక్తి రహితములు
విభక్తి రహిత తత్సమ ( సంస్కృత పదాలు స్వల్ప మార్పులు లతో తెలుగులో వాడుకలో ఉన్నవి) పదాలు మార్పులు ఏమియు లేకనే విభక్తి ప్రాతిపదికములుగా (oblique stem) వ్యవహరించును.
ఉదాహరణ:
హరి + ని → హరిని, హరి + చేత → హరి చేత
విధాత + చేత → విధాత చేత
విభక్తి రహిత అచ్చ తెలుగు పదములకు విభక్తి ప్రత్యయములు కలిసినపుడు కొన్నింటికి ఔప విభక్తికము చేరి, మరికొన్నింటికి ఏమియూ చేరక oblique stem ఏర్పడుతుంది.
ఉదాహరణ:
Oblique stems : గోయి → గోతిలో, చేయి → చేతిలో
వీటిని ఔప విభక్తి కాంములు అందురు.
Non oblique stems : దొర → దొరను, దొరతో
వీటినే అనౌప విభక్తి కాంతములు అందురు.
Note: foreign languages నుంచి అరువు తెచ్చుకున్న nouns oblique stem మరియు Nominative case form ఒకటే విధంగా ఉంటుంది.
ఉదాహరణ:
నౌకరు + తో → నౌకరుతో
ఔప విభక్తి అంతంగా ఉన్న పదాలు
తెలుగులో ఔప విభక్తికాలుగా - ఇ, టి, ంటి, తి లాంటి వాటిని గుర్తించవచ్చును.
ఇ: ఊరు లాంటి ఉ అంతంగా ఉన్న నామవాచకాలపై విభక్తి ప్రత్యయములు చేరినపుడు ‘ఇ’ అనే ఔప విభక్తికం చేరుతుంది.క్తి
ఉదాహరణలు:
కాలు + కి → కాల్ + ఉ + ఇ + కి → కాలి + కి → కాలికి
చోటు + ని → చోటిని
ఊరు + లో → ఊరిలో
రాముడు + కి → రాముడికి
టి: టి అక్షరం కొన్ని శబ్దాలకు replacement గాను, కొన్నింటికి additional గాను కొన్నింటికి replacement మరియు additional గా వస్తుంది.
మానవేతర వాచకాల్లో మొదటి అక్షరం దీర్ఘమై పదాంతంలో డు, డి, రు, రి, లు, లి అనే అక్షరాలుంటే ‘టి’ replacement గా వస్తుంది.
ఉదాహరణ:
Replacement (ఆదేశంగా):
తాడు + ని → వాటిని
నోరు + లో → నోటిలో
Additional ( ఆగమమంగా):
ఎనిమిది + తో → ఎనిమిదిటితో
వేయి + ని → వేయిటిని
Both( ఉభయంగా):
పగలు + కై → పగటికై, పగలిటికై
మూడు + పై → మూటిపై, మూడింటి పై
ంటి: హ్రస్వము ( అంటే అ, ఈ, ఈ, ఎ ఒ లు) మీద విభక్తి ప్రత్యయాలు చేరినపుడు ‘ంటి’ పరమవుతుంది.
ఉదాహరణలు:
అన్ని + కి → అన్నింటికి
( అ+ న్ + న్ + ఇ + కి → న్ + న్ + ఇ + ంటి + కి → అన్నింటి + కి → అన్నింటికి)
ఎనిమిది+ కి → ఎనిమిదింటికి
రెండు+ తో → రెండింటితో
మూడు + ని → మూడింటిని
న్ను, ల్లు, ళ్ళు అనే అక్షరాలతో అంతమయ్యే పదాలు తొలి అచ్చు మీద వర్ణాలకు ’ంటి’ replacement గా వస్తుంది.
ఇల్లు → ఇంటి, కన్ను → కంటి, మిన్ను → మింటి, ఒళ్ళు → ఒంటి
తి: యి తో అంతమయ్యే ‘య’ కారానికి ‘త’ కారం replacement గా వస్తుంది.
ఉదాహరణలు:
చేయి → చేతి, నేయి → నేతి, రాయి → రాతి
ఇప్పుడు మనం English భాషలో nouns’ inflection case కి అనుగుణంగా ఏలా జరుగుతుంది అనే విషయం తెలుసుకుందాం.
English cases:
Case అనేది noun యొక్క property. Case కి అణుగుణంగా noun word spelling మార్పు చెందుతుంది.
అసలు case అని English grammar లో దేనిని అంటారు?
Noun case అనగా noun పదం వాక్యం లోని మిగతా పదాలతో ఎటువంటి relation లో ఉంది అనే విషయం స్పష్టంగా చెబుతుంది.
Example:
మనం ఈ క్రింది వాక్యం ఉదాహరణగా తీసుకుంటే:
Cats eat mice.
ఈ పై వాక్యం లో eating తినడం అనే action cats నుంచి మొదలై mice వైపుకి direct చేయబడింది. Nouns cats మరియు mice యొక్క relationship క్రియ పదం eat తో వేరు వేరేగా ఉంది. ఏలా? ఒకటి అంటే cats అనే noun eat అనే verb యొక్క source గాను మరియు mice అనే noun eat అనే verb కి sink లేక destination గాను ఉన్నాయి. కావున మనం nouns cats మరియు mice different cases లో ఉన్నాయి అని పేర్కొన వచ్చును.
కొన్ని సార్లు English భాషలో case ని ఒక suffix గా చూపవచ్చును. ఈ క్రింది example లో ‘s suffix bird noun కి తగిలించడం గమనించండి.
Example: The bird's song
కొన్ని సార్లు case ని ఒక preposition ద్వారా చూపించవచ్చును. ఈ క్రింది example లో of the bird phrase (పదబంధం) ని గమనించండి.
Example:
The song of the bird
కొన్ని సార్లు noun అనేది inflection కి గురి కాదు. ఈ క్రింది examples లో noun bird ని చూడండి.
Example:
The bird sings.
I caught a bird.
English భాష లో మనకు ఈ క్రింది cases ఉన్నాయి.
Nominate/ Subjective
Accusative/ Objective
Dative
Genitive/ Possessive and
Vocative
గమనిక: తెలుగులో మనకు 8 cases ఉన్నాయి. English లో 5 cases కనిపిస్తున్నా మిగతా cases preposition సహాయంతో instrument case( preposition with), Ablative case( preposition from ) మరియు locative case ( preposition in) సాధిస్తాం. English మన తెలుగు భాషతో పోల్చి చూస్తే అంత inflectional language కాదు.
మనం ఈ క్రింది పేరాలలో English భాషకు సంబంధించిన 5 cases గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం.
Nominate case:
Nominate case మనకు source of action గురించి చెబుతుంది అంటే ఎక్కడ నుంచి action అనేది మొదలవుతుంది. The Nominative case noun ని మనం subject of the verb అని అంటాం.
Example:
The boy reads.
The star shines.
పైన పేర్కొన్న మొదటి example లో reading అంటే చదవడం అనే action the boy నుంచి మొదలవుతుంది. కాబట్టి the boy అనే noun Nominative case లో ఉంది అని తెలుసుకుంటాం.
పైన పేర్కొన్న రెండవ example లో shines అంటే మెరవడం అనే action the star నుంచి మొదలవుతుంది. కాబట్టి the star అనే noun Nominative case లో ఉంది అని తెలుసుకుంటాం.
Accusative case:
Accusative case action ఏ noun మీదకి direct చేస్తామో దానిని mark చేస్తుంది. మనం Accusative case ని object of the verb అని కూడా అంటాం.
Example:
The boy strikes the ball.
The sun warms the earth.
పైన పేర్కొన్న మొదటి example లో, striking అనే action ని the ball కి direct అవుతుంది. కావున the ball అనే noun Accusative case లో ఉంది అని తెలుసుకుంటాం.
పైన పేర్కొన్న రెండవ example లో, warming అనే action ని the earth కి direct అవుతుంది. కావున the earth అనే noun Accusative case లో ఉంది అని తెలుసుకుంటాం.
Genitive/Possessive case:
ఈ case లో ఒక వస్తువు నుంచి ఎదో విషయం ముందుకు సాగుతుంది.
Example:
The sun's heat
The light of the moon
పైన పేర్కొన్న మొదటి example లో, heat అనే విషయం the sun అనే noun నుంచి కొనసాగుతుంది.
పైన పేర్కొన్న రెండవ example లో, light అనే విషయం the moon నుంచి proceed అవుతుంది.
పైన పేర్కొన్న మొదటి example లో, the sun's heat లో sun లోంచి heat వస్తుంది కాబట్టి ఈ heat యొక్క owner sun. కాబట్టి ఈ case ని possessive case అని కూడా అంటారు.
మనం genitive case ని రెండు విధాలుగా చూపించవచ్చును.
Of preposition వాడి చూపించవచ్చును
Example:
The heat of the sun
By adding ‘s to noun ( apostrophe s)
Example:
The sun's heat
ఒక్కోసారి noun plural ‘s’ తో end అయితే apostrophe s తరువాత రాయాలి.
Example: the birds' nests
Dative case:
ఒక person కోసం ఏమైనా చెప్పిన, ఇచ్చిన లేకపోతే ఏదైనా పని చేయబడిన అట్టి person dative case లో ఉన్నాడు అని చెప్పవచ్చును. దీనిని verb యొక్క indirect object అని కూడా అంటారు. ఈ dative case noun beneficiary ని చూపిస్తుంది. కాబట్టి ఆ beneficiary ఎప్పుడూ ఒక మనిషి అయి ఉంటాడు.
Example:
He told them the truth.
Give me the knife.
I wrote him a letter.
We sent her the book.
పైన పేర్కొన్న అన్ని examples లో them, me, him మరియు her అనేవి dative case లో ఉన్నాయి. ఒక వేళ ఈ objective personal pronouns బదులు proper noun కాని common noun కానీ ఉన్న ఎడల అది Nominative case లో ఎలా ఉందో అలా ఉండేది.
Vocative case:
మనం ఒక మనిషిని ఉద్దేశించి మాట్లాడేప్పుడు, కొన్ని సార్లు ఆ మనిషి పేరు ముందుగా రాసి ఆ తర్వాత మనం వారికి సంబంధించిన వాక్యం రాస్తాం. ఏ noun ని ముందుగా రాశామో, అది vocative case ఉంది అని అంటాం.
Examples:
John, how was your day?
Doctor, can you help me with this problem?
Mom, when will dinner be ready?
పైన పేర్కొన్న examples లో, ఆ వాక్యాలు John, Doctor మరియు Mom ని ఉద్దేశించి చెప్పబడినవి. కావున అవి vocative case లో ఉన్నాయి. Vocative case noun తరువాత comma ఉంచబడింది.
To decline a noun means to give the cases of the noun in the singular and plural. ఈ విధంగా రాయబడిన noun cases ని ఆ noun యొక్క declension అంటారు.
Examples: man, fox
Singular. Plural
Nom. Man. Men
Acc. Man. Men
Gen. Man's. Men's
Dat. Man. Men
Voc. Man, Men,
Singular. Plural
Nom. Fox. Foxes
Acc. Fox Foxes
Gen. Fox's Foxes’
Dat. Fox Foxes
Voc. Fox, Foxes,
Exercise:
Please decline the following nouns as shown in the above two examples and write your answers in the comments section.
Child
King
Boy
Son-in-law
Comments
Post a Comment