Indefinite articles సులువుగా కరెక్ట్ గా వాడే పద్దతి
మనకు తెలుగులో articles అనేవి లేవు. కావున మన మందరం వాటిని వాడటం లో తరచుగా తప్పులు చేయడం సహజం. ఒక వేళ మనం తెలుగు లో వాటిని ఎట్లైనా వాడాలి అంటే అప్పుడు మన తెలుగులో “ఒక” అని వాడుతాము. అప్పుడు మన తెలుగు కాస్త అసహజంగా ఉంటుంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ articles one యొక్క వివిధ రూపలు అని తెలుసుకోవాలి.
English భాష లో రెండు రకాల articles ఉన్నాయి: ఒకటి definite మరియు ఇంకొక రకం indefinite.
మనం ఈ బ్లాగలో indefinite articles గురించి తెలుసుకుందాం. మనకు English భాష లో రెండు indefinite articles ఉన్నాయి. అవి ఏమిటంటే a మరియు an.
English గ్రామర్ రూల్ ప్రకారం vowel sound ఉన్న singular countable nouns ముందు indefinite article “an” వాడాలి. ఇక మిగతా వాటికి “a” వాడితే సరిపోతుంది.
మనం “an” విషయంలోనే దెబ్బతింటున్నాం. ఎందుచేతనంటే మనకు vowel మరియు consonant అంటే తేడా పూర్తిగా తెలియకపోవడమే దీనికి కారణం.
మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏమిటంటే alphabets అంటే శబ్దాలకు ప్రతిరూపాలు. ఈ alphabet ద్వారా శబ్దం మనం కళ్ళకు కనపడేట్లు చేస్తున్నాం. ఈ శబ్ధాలను మన రాత ద్వారా చూపించడానికి మనం తెలుగు అక్షరమాల కానీ English alphabet కానీ ఆ ఆ భాషల్లో వాడుతుంటాము.
ఈ vowel sound అనేది consonant కి ప్రాణం పోస్తుంది. అదే విషయం మనం తెలుగు భాషలో కూడా చూడవచ్చును గుణింతాల ద్వారా.
అయితే ఈ vowel sound అంటే ఏమిటి ? దానిని సులువుగా తర్కంతో ఎలా కనుక్కోవడం ?
ఇది చాలా మంచి ప్రశ్న. దీని సమాధానం మనకు మనమే కనుక్కోవచ్చును. ఈ అమరిక మన అందరిలో ఉంది.
దీనిని తెలుసుకోవడానికి మనం ఈ క్రింది ప్రయోగం చేద్దాం.
ప్రయోగం:
మనం తెలుగు అక్షరమాలలో అచ్చులు హల్లులు అనేవి ఉన్నాయి. అచ్చుల్ని vowels అనియు Consonants ని హల్లులు అంటాం.
మీరు “అఅఅఅఅఅఅఅఅఅఅఅ” అని continuous అనండి. అనిన తరువాత మీరు ఈ శబ్దం కనుక నిశితంగా పరిశీలించినట్లైతే ఎక్కడ కూడా స్వరపేటిక నుంచి వస్తున్న శబ్దానికి ఎటువంటి ఆటంకం నోటిలో కలగదు.
ఇదే విధంగా మరికొన్ని అచ్చులతో (ఆ, ఈ ఉ ) పైన పేర్కొన్న ప్రయోగం జరపండి. పైన చెప్పిన observation ని గుర్తించండి.
ఇక ఈ ప్రయోగం కొన్ని హల్లులతో కూడా చేయండి. ఉదాహరణకు కు “ప” తో చేయండి.
“పపపపపపపపపపపపప”. ఇక్కడ స్వరపేటిక లోంచి వచ్చిన శబ్దంకి పెదవుల ద్వారా ఆటంకం కలిగింది కదూ. ఇటువంటి వాటిని హల్లులు లేదా non vowel sound అంటారు.
ఇప్పుడు మనం English భాషలో a, e, i, o, u మీద కూడా ఇదే ప్రయోగం చేద్దాం. దీంతో vowel sound అనేది మనకు పూర్తి అవగాహన వస్తుంది.
“aaaaaaaaaaaaaaaaa”
“eeeeeeeeeeeeeeeeeee”
“iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii”
“ooooooooooooooooo”
“uuuuuuuuuuuuuuuuuuu”
కాబట్టి singular countable noun words మరియు vowel sound ఉన్న వాటి ముందు indefinite article “an” అనేది correct గా పెడదాం. ఈ vowel sound తో ఏమైనా పదాలు మొదలు కావడం లేదు అంటే అప్పుడు “a” article పెడదాం.
ఎంత సులువు కదా! ఈ క్రింది exercise ప్రయత్నించండి. మీరు సులువుగా అన్నీ కరెక్ట్ గా చేయడం తథ్యం.
Exercise:
Car, Desk, Umbrella, Elephant, Laptop, Orange, Tiger, Hat, Pen, Violin, eye
Comments
Post a Comment